ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగతంగా హాజరై ఆర్టీసీ సమ్మెపై వివరణ ఇవ్వాలని
బీసీ కమిషన్ వారిని ఆదేశించింది. ఈ నెల 25న పూర్తి నివేదికతో ఢిల్లీలో బీసీ కమిషన్ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఆర్టీసీ సమ్మెలో జోక్యం చేసుకోవాలని బీసీ కమిషన్‌ను ఆర్టీసీ జేఏసీ కోరింది. ఆర్టీసీ కార్మికుల్లో 20 వేలకు పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అయితే... సమ్మెలో పాల్గొన్న కార్మికులను డిస్మిస్ చేశామని ప్రభుత్వం తెలిపిందని కార్మికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదుతో స్పందించిన బీసీ కమిషన్ ఈ మేరకు నోటీసులు పంపింది.