Print
Hits: 2726
maharashtra election campaign ends today

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ

నియోజకవర్గాలకు ఈ నెల 210న ఎన్నికలు జరగనున్నాయి. కాగా... మహారాష్ట్ర ఎన్నికల బరిలో 288 స్థానాలకు గాను మొత్తం 3,239 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ 90,403 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసింది. 8,95,62,706 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మరోవైపు... హర్యాన ఎన్నికల బరిలో 90 నియోజకవర్గాలకు 1,168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా... ఓటర్ల కోసం ఎన్నికల కమిషన్ 19,425 పోలింగ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేసింది. మొత్తం 1,82,98,714 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 21వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈనెల 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ జరగనుంది.

e-max.it: your social media marketing partner