ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే రామ్ నివాస్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015 ఫిబ్రవరి 6వ తేదీన
తూర్పు ఢిల్లీలో బిల్డర్ ఇంటిపై రామ్ నివాస్ ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. అదే సంవత్సరం బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఎమ్మెల్యేపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో ఎన్నికలముందు దుప్పట్లు, లిక్కర్ పంచుతున్నాడని బిల్డర్ ఇంటిపై రామ్ నివాస్, అతని అనుచరలు దాడికి పాల్పడినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. దాడిలో అల్మారా, కిచెన్ వస్తువులు, కిటికీలు ధ్వంసమయ్యాయని, అడ్డుకోబోయిన పనివాళ్లపై దాడి చేశారని ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. కాగా... అప్పట్లో ఢిల్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.