ఢిల్లీ: అయోధ్య స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టులో నలభై రోజులుగా జరుగుతున్న విచారణలో ఈ రోజు హై డ్రామా చోటుచేసుకుంది. హిందీ మహా సభ తరపున సీనియర్ న్యాయవాది
వికాస్ సింగ్ రామ జన్మస్థానం చూపిస్తున్న ఓ మ్యాప్‌ను న్యాయమూర్తికి సమర్పిస్తుండగా... ముస్లిం వక్ఫ్ బోర్డు తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఆ మ్యాప్ ను చింపివేశాడు. ఈ ఘటన న్యాయమూర్తులకు ఆగ్రహం తెప్పించింది. ఈ టైటిల్ సూట్‌లో రామ జన్మస్థానాన్ని చూపించే చిత్తరువుతో కూడిన మ్యాప్‌ను రాజీవ్ ధవన్ చింపివేస్తూ 'దీన్ని చింపేయడానికి మీరు అనుమతిస్తారా' అని న్యాయమూర్తులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడంతో సీజేఐ రంజన్ గొగోయ్ మండిపడ్డారు. 'సభా మర్యాదాలు మంటగలిశాయి. మేము వాకౌట్ చేస్తాం' అని అన్నారు. రాజకీయంగా అతి సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై రోజువారి విచారణ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.