ఢిల్లీ: సుప్రీంకోర్టులో అయోధ్య వివాదంపై ఈ రోజుతో విచారణ ముగియనుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై సాయంత్రం 5 గంటల వరకు వాదనలు విననున్న ధర్మాసనం అనంతరం
తీర్పును రిజర్వ్ చేయనున్నట్లు సమాచారం. తమ తమ వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్ని పక్షాలకు సమయాన్ని కేటాయించనున్నారు. కాగా... తీర్పు నేపధ్యంలో అయోధ్యలో 144 సెక్షన్ విధించారు.