Print
Hits: 1019

ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అనంత్‌నాగ్‌ జిల్లాలోని పాజల్‌పురా ఏరియాలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కు చెందిన ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ఈ రోజు ఉదయం నుంచి అక్కడ భద్రతా బలగాలు, పోలీసులతో కలిసి కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

e-max.it: your social media marketing partner