ఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది. ఈ నెల 21వ తేదీ పోలింగ్ జరిగే సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశించింది. 21న హర్యానా, మహారాష్ట్ర శాసనసభల ఎన్నికలతో పాటు దేశంలోని 17 రాష్ర్టాల్లోని వివిధ 51 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఓపినియన్ పోల్, పోల్ సర్వే నిర్వహించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం గట్టిగ హెచ్చరించింది. కాగా... హర్యానాలో 99, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న వెలువడనున్నాయి.