బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివ కుమార్ కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో జూడిషియల్ కస్టడీని ఈ నెల 25వ తేదీ వరకు పెంచుతూ
కోర్టు తీర్పిచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టేరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ నిమిత్తం ప్రత్యేక జడ్జీ అజయ్ కుమార్ కౌర్ కస్టడీకి కోర్టు అప్పగించింది. శివకుమార్ బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.