లక్నో: ఉత్తరప్రదేశ్ హోంగార్డులకు యూపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. 25 వేల మంది హోంగార్డు ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. బడ్జెట్ లేదన్న
కారణంతో వారిని తొలగిస్తున్నట్టు యోగి ప్రభుత్వం ప్రకటించింది. అయితే... దీపావళి పండుగకు ముందు ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన సమావేశంలో యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డుల తొలగింపుపై తుది నిర్ణయం తీసుకుంది. కాగా... వీరిలో ఎక్కువ మంది ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. మరో 99వేల మంది హోంగార్డులు ఇకపై నెలలో 25 రోజులకు బదులుగా 15 రోజులు మాత్రమే విధులకు రావాలని సూచించింది. కేవలం 15 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తామని యూపీ సర్కార్ తేల్చి చెప్పింది.