లక్నో: ఉత్తరప్రదేశ్లోని మవు జిల్లా మొహమ్మదాబాద్లో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం
కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో 15 మంది గాయపడినట్టు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను వెలికి తీస్తున్నారు. కాగా... ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.