హైదరాబాద్: రాజస్థాన్‌లో ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపం కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని బికనీర్‌లో ఈ ఉదయం 10.36 గంటలకు
ఆ భూకంపం సంభవించినట్టు వాతావరణ శాఖ విభాగం తెలిపింది. అయితే... ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా... గత సోమవారం భూటాన్‌లో సంభవించిన భూకంపానికి అస్సాం రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రభావితమైన విషయం తెలిసిందే. అదేవిధంగా గతవారం మణిపూర్‌లోని ఇంపాల్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత ఈశాన్య ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. అయితే... బికనీర్ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వాతావరణ శాఖ తెలిపింది.