Print
Hits: 835
pm modi to met jinping

చెన్నై: భారత ప్రధాని మోదీతో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిన్‌పింగ్ భారత్ లో పర్యటిస్తున్న

విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ తమిళనాడులోని కోవలమ్‌లో ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ... . భారత ఆతిథ్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. భారత్-చైనా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలున్నాయని అన్నారు. 

అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ సమావేశం ఇరుదేశాల మైత్రిని మరింత బలపర్చిందని, వూహన్ సమ్మిట్ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు. రెండు దేశాల మధ్య విశ్వాసం మరింత పెరిగిందని తెలిపిన మోదీ.. చెన్నై విజన్‌తో కొత్త శకం ఆరంభమైందన్నారు. భారత్-చైనాల మధ్య కొన్ని వేల సంవత్సరాల నుంచే ఆర్థిక శక్తులుగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. కాగా... ఈ పర్యటన అనంతరం జిన్ పింగ్ నేరుగా నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ జిన్‌పింగ్ కాన్వాయ్ వద్దకు స్వయంగా వెళ్లి అతడిని సాగనంపారు.

e-max.it: your social media marketing partner