చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో సమావేశమయ్యారు. కోవలంలోని హోటల్ తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్‌లో ఇరువురు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ
సహకారం వంటి అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా... చెన్నై సమీపంలోని మామల్లపురంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిన్న భేటీయై అక్కడి చారిత్రక కట్టడాలు అర్జున తపస్సు, కృష్ణుడి వెన్నముద్ద రాయి, ఐదు రథాలు, షోర్ టెంపుల్ కాంప్లెక్స్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.