హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ను కలిశారు. తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టుతో మహాబలిపురానికి
చేరుకున్న ప్రధాని అక్కడి శోర్ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. కాగా... ప్రస్తుతం మోదీ, జిన్‌పింగ్ ఇరువురు కలిసి 7వ 8వ శతాబ్దానికి సంబంధించిన, వెయ్యేళ్ల చరిత్ర కలిగిన పలు చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మహాబలిపురం ప్రాశస్త్యాన్ని జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ వివరిస్తున్నారు.