కొమొరోస్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆఫ్రికా దేశంలో అరుదైన గౌరవం దక్కింది. కొమొరోస్ అత్యున్నత పౌరపురస్కారం 'ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్' ను ఆ
దేశాధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా ఈ రోజు అందుకున్నారు. ఆఫ్రికా దేశం కొమొరోస్లో ఉపరాష్ట్రపతి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... భారత్-కొమొరోస్ మైత్రికి గుర్తుగా కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడం గౌరవంగా ఉందని అన్నారు. 130 కోట్ల భారతీయుల తరపున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నానని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరు, భద్రతా మండలిలో సంస్కరణలు, యూఎన్వోలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు వంటి సంయుక్త లక్ష్యమే మనల్ని కలిపిందని వెంకయ్య అన్నారు.