హైదరాబాద్: రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెన్నైకు చేరుకున్నారు. ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్,
సీఎం పళనిస్వామి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం చెన్నై విమానాశ్రయం నుంచి జిన్‌పింగ్ గిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు బయల్దేరివెళ్లారు. కాగా... ఈ పర్యటనలో ఆయన మహాబలిపురంలో పర్యటించనున్నారు. అదే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కూడా భేటీ కానున్నారు. మరోవైపు ప్రధాని ఇప్పటికే మహాబలిపురానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా... ఈ ఇద్దరు నేతల మధ్య ఈ రోజు రెండో అనధికార సమావేశం జరగనుంది.