ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత
మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని బంగ్లా ప్రధాని పీఎం మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వాణిజ్యం, రవాణా, అనుసంధానత, అభివృద్ధి, సామర్థ్యం పెంపు, సంస్కృతి సహా ఇలా పరస్పర ప్రయోజనం కల్పించే ఆరు నుంచి ఏడు ఒప్పందాలపై ఈ రోజు సంతకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే... బంగ్లాదేశ్ ప్రధానితో కలిసి ఈ రోజు మోదీ మూడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఇప్పటికే విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.