జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో గ్రేనేడ్ దాడి కలకలం సృష్టించింది. పోలీసులే టార్గెట్ గ అనంత్‌నాగ్‌లోని డిప్యూటీ కమిషనర్స్ ఆఫీసు ముందు గ్రేనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు
10 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఓ ట్రాఫిక్ పోలీసుతో పాటు జర్నలిస్టు కూడా ఉన్నట్లు సమాచారం. వారిని స్థానిక ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పట్ల విచారణ మొదలుపెట్టారు.
అయితే... ఉగ్రవాదులు డిప్యూటీ కమిషనర్స్ ఆఫీసును టార్గెట్ చేసినా... గ్రేనేడ్ రోడ్డుపైనే పేలడంతో ఆ సమయంలో దగ్గరలో ఎక్కువ జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం భద్రతా దళాలపై దాడి జరగడం ఇది రెండవసారి.