ఢిల్లీ: దేశంలోని పరిణామాలను చూస్తే మహాత్మాగాంధీ ఆత్మ కచ్చితంగా క్షోభిస్తోందని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. ఈ రోజు మహాత్ముని 150వ జయంతి
సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద గాంధీకి ఆమె ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో గత కొన్నేళ్లుగా హింస పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్ముడు పిలుపునిచ్చిన శాంతి, అహింస ఎక్కడ కనిపించడంలేదని మండిపడ్డారు. మహాత్మాగాంధీ ఆశయాలను అర్ధం చేసుకోకుండా తమకు తాము సుప్రీం అని వాళ్లెలా అనుకుంటారు? తప్పుడు రాజకీయాలు చేసేవాళ్లు మహిత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరు అని సోనియాగాంధీ అన్నారు. భారత్, గాంధీ రెండు ఒకటేనని, అయితే కొందరు వ్యక్తులు భారత్ ను, ఆర్ఎస్ఎస్తో పోల్చి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.