ఢిల్లీ: ఈ రోజు మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గాంధీజీకి నివాళులర్పించారు. ఆయనతో పాటు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారంతా జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకున్నారు.