జమ్ముకశ్మీర్: భారత భద్రతా దళాలు భారీ స్థాయిలో ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నాయి. జమ్ములోని ఓ బస్టాండ్‌లో ఆగి ఉన్న ఓ బస్సులో
తనిఖీ చేస్తుండగా... వారికి సుమారు 15 కిలోల ఆర్డీఎక్స్ దొరికింది ఆ పేలుడు పదార్థాన్ని సీజ్ చేసిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జమ్ము రాష్ట్రంలోని కథువా జిల్లా బిలావర్ నుంచి జమ్మూకు ఆ బస్సు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా... ఇటీవలే పోలీసులు బిలావర్‌లో సుమారు 40 కేజీల గన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.