ఢిల్లీ: వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ రోజు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిశారు. ఢిల్లీలోని కొచ్చిన్ హౌస్ లో ఈ రోజు ఉదయం వారిద్దరు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో
వాయనాడ్ లోని ఎన్‌హెచ్-766పై రాత్రి పూట ట్రాఫిక్‌ను నిషేధించాలని ఎంపీ రాహుల్ గాంధీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. అలాగే... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాయనాడ్ లో వచ్చిన వరదల తర్వాత చేపట్టిన సహాయక చర్యల గురించి కూడా రాహుల్ గాంధీ సీఎం విజయన్ తో చర్చించినట్టు తెలుస్తోంది.