హైదరాబాద్: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను డీఆర్‌డీవో ఈ రోజు విజయవంతంగా పరీక్షించింది. ల్యాండ్ అటాక్ వర్షన్‌కు చెందిన బ్రహ్మోస్
పరీక్షా ఒడిశాలోని చాందిపుర్‌లో జరిగింది. 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని టార్గెట్ చేసే విధంగా డీఆర్‌డీవో అధికారులు ఈ పరీక్షను చేపట్టారు. ప్రొపల్షన్ సిస్టమ్, ఎయిర్‌ఫేమ్, పవర్ సప్లై లాంటి ఇతర భారత కంపోనెంట్లను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించారు. కాగా.. ఈ పరీక్షలో బ్రహ్మోస్ విజయవంతమయిందని అధికారులు స్పష్టం చేశారు.