ఢిల్లీ: దేశంలో యువకులంతా పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పొగాకు, సిగరెట్లు, ఈ సిగరెట్ల వలన
ఆరోగ్యం పాడవుతుంది పేర్కొన్నారు. ఈ రోజు మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ... యువత పొగాకు బానిసలు కావద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. షాపుల్లో, ఆన్లైన్ లో వికయిస్తోన్న ఈ- సిగరెట్లు హాని చేయవని చాల మందిలో ఓ అపోహ ఉందని... కానీ సిగరెట్లు, పొగాకు మాదిరిగానే ఈ- సిగరెట్లు కూడా ఆరోగ్యానికి చాలా హానికరమని యువతకు వివరించారు. అందుకే ఈ- సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించిందని ప్రధాని పేర్కొన్నారు. కాగా... దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల విజయాలను వేడుకలా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.