హైదరాబాద్: దాయాది పాకిస్థాన్ కు, ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. భారత్ ను అస్థిరపరిచేందుకు పాక్ ఉగ్రవాదాన్ని
ఉపయోగించుకుంటుందని, కానీ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన భద్రతా సిబ్బందితో కలిసి యోగా చేశారు. అనంతరం రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ... 26/11 ముంబై దాడులను తామెవ్వరం మరచిపోలేదన్నారు. అటువంటి చర్యలు దేశంలో ఇంకోసారి పునరావృతం కావన్నారు. నేవీ, కోస్ట్ గార్డ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నారని స్పష్టం చేశారు. ఐఎన్‌ఎస్ ఖండిరి జలాంతర్గామితో భారత్ నావికా దళం బలం రెట్టింపయిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.