ఢిల్లీ: భారత్‌లోని అన్ని మిలిటరీ ఎయిర్ బేస్‌ల వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) హై-అలర్ట్ ప్రకటించింది. జైషే మహ్మద్ ఉగ్రవాదులు జవానులపై ఎయిర్ బేస్‌ల వద్ద ఆత్మాహుతి
దాడికి పాల్పడే అవకాశముందని ఐబీ (ఇంటలిజెన్స్ బ్యూరో) హెచ్చరికల నేపథ్యంలో ఐఏఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. జమ్మూ కశ్మీర్ సహా దేశంలోని అన్ని ఎయిర్ బేస్‌ల వద్ద ఐఏఎఫ్ హై-అలర్ట్ ప్రకటించింది. దీంతో అధికారలు భద్రత కట్టుదిట్టం చేశారు.