ఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో నుంచి
నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ర్టాల్లోని పార్టీ పరిస్థితులను, అభివృద్ధి పనులను ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సమాధానంగా సీఎంలు వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్థి పనులను వివరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు.