హైదరాబాద్: వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని మళ్ళీ తానె సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈ రోజు ఎన్నికల
నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అక్టోబర్ 21వ తేదీన జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. అయితే... 162 స్థానాల్లో బీజేపీ, 126 స్థానాల్లో శివసేన పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ అబద్దాలేనని మరికొన్ని రోజుల్లో సీట్ల పంపిణీపై ప్రకటన చేస్తామని సీఎం చెప్పారు. తామెప్పుడూ శివసేనకు ఆదేశాలు ఇవ్వలేదని, నిర్ణయాలన్నీ సానుకూలంగా చేసుకున్నామని ఫడ్నీవస్ చెప్పారు. కాగా... శివసేనకు చెందిన సామ్నా పత్రికను తానెప్పుడూ చదవలేదని, క్యాబినెట్లో ఉన్న శివసేన మంత్రులతో కలిసే పూర్తి నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం ఫడ్నవిస్ తెలిపారు.