ఉత్తరప్రదేశ్: యూపీ రాష్ట్ర రైతులు మళ్ళీ ఆందోళన బాట పట్టారు. చెరుకు పంట బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తు ఈ రోజు భారతీయ కిసాన్ సంఘటన
ఆధ్వర్యంలో ఢిల్లీకి ర్యాలీ చేస్తున్నారు. రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దిశగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇతర పంటలకు కూడా రుణమాఫీని ప్రకటించాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ఢిల్లీ-యూపీ బోర్డర్ వద్ద ఉన్న ఘాజీపూర్‌లో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపితే, తాము తిరిగి వెనక్కి వెళ్తామని భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు పురాన్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కిసాన్ ఘాట్ వైపు వస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.