ఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదితో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... బెంగాల్లో జరుగనున్న
వాణిజ్య సదస్సు (బిజినెస్ సమ్మిట్)కు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించామన్నారు. అలాగే బెంగాల్ పేరును 'బంగ్లా'గా మార్చే విషయంపై కూడా ప్రధానితో చర్చించానని తెలిపారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు మమతా చెప్పారు. అలాగే... పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి రూ.12,000 కోట్ల ఆర్ధిక సాయం కోరామని చెప్పారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సముఖంగా ఉన్నామని కూడా మమతా స్పష్టం చేశారు. కాగా... బెంగాల్ లో ఎన్ఆర్సీపై మీడియా ప్రశ్నించినప్పుడు ఆ అంశం తమ సమావేశంలో ప్రస్తావనకు రాలేదని మమత దాటవేశారు.