ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్ర మోడీ
సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించాలని సోనియాగాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు.