కెవడియా: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తన 69వ పుట్టినరోజును తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో జరుపుకొన్నారు. గాంధీ నగర్‌లో ఉంటున్న తన తల్లి హీరాబెన్‌ను కలుకుని
ఆమె ఆశీస్సులు పొందారు. అనంతరం కెవడియాలో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీని సందర్శించారు. అలాగే... నర్మదా జిల్లాలో వివిధ పథకాలు, ప్రాజెక్టులను సమీక్షించారు. మరోవైపు కెవడియాలోని ఖల్వని ఏకో-టూరిజం సైట్‌ను కూడా ప్రధాని సందర్శించారు. సీతాకోకచిలుకల గార్డెన్‌లో సీతాకోకచిలుకలను ఎగురవేస్తూ ఆహ్లాదంగా గడిపారు. ప్రధాని పర్యటనలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.