కోల్‌కతా: ఇవి ఎమర్జెన్సీ రోజులంటూ... ప్రస్తుతం మనం సూపర్ ఎమర్జన్సీ శకంలో ఉన్నామంటూ మోడీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు వెస్ట్ బెంగాల్
సీఎం మమతా బెనర్జీ. ఈ రోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా... బీజేపీ పేరు ఎత్తకుండా ఆమె ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ రాజ్యాంగ పునాదులపై ఈ దేశం నిర్మాణం జరిగిందో.. వాటిని రక్షిస్తామని మరోసారి ప్రతిజ్ఞ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, స్వేచ్ఛను కాపాడుకోవాలని ట్వీట్ లో దీదీ పిలుపునిచ్చారు.