ఢిల్లీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది. ఈ రోజు ఉదయం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ స్థాయి సంఘాలను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా
వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని నియమించారు. ఈ కీలక పదవి విజయసాయి రెడ్డికి వారించడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీలో విజయసాయి చైర్మన్ గ ఉండగా... మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామా, కేశినేని నానిని సభ్యులుగా నియమిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.
కాగా... పరిశ్రమల 7వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా కే కేశవరావును, పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ సభ్యుడిగా అవినాష్ రెడ్డిని నియమిస్తున్నట్లు కూడా ఓం బిర్లా తెలిపారు. మరోవైపు... రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్‌గా టీజీ వెంకటేష్, పార్లమెంట్ వ్యవహారాల ఆర్థికశాఖ సభ్యులుగా మిథున్‌రెడ్డి, సీఎం రమేష్‌ను నియమిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు.