కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యా, బంగ్లాదేశ్ ముస్లింలకు టీఎంసీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
దిలీప్ ఘోష్. జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సీ)కు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి త్వరలో బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అమలు చేసి, రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు. కాగా... అస్సాంలో ప్రభుత్వం విడుదల చేసిన ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో దాదాపు 19 లక్షల మందికి స్థానం దక్కని విషయం తెలిసిందే. ఈ నివేదికన బెంగాల్ లో ఇంకా ఎక్కువ మంది స్థానికేతరులు ఉండే అవకాశం ఉన్నట్లు దిలీప్ ఘోష్ చెప్పుకొచ్చారు.