ముంబై: మహారాష్ట్రలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయన్నారు
మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్. కాగా... మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి కాంగ్రెస్ 123 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎన్సీపీ 125 స్థానాల్లో పోటీ చేయనుందని, మిగిలిన 41 స్థానాల్లో తమ కూటమిలోని చిన్నాచితకా పార్టీలు పోటీ చేస్తాయని ఆయన వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమని, మా కూటమి తప్పక ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి గుండె లాంటివని, కానీ ఇప్పుడవి తీవ్ర సంక్షోభంలో ఉన్నాయన్నారు. కొంతమంది ఈ దేశంలో ఏక పార్టీ పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అలా అయితే ఈ దేశంలో మల్లి అత్యవసర పరిస్థితి వస్తుందని అని ఆయన హెచ్చరించారు.