షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 27వ గవర్నర్‌గా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ(72) ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు
రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత దత్తాత్రేయ ప్రమాణం చేశారు. కాగా... ఈ సందర్భంగా దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక టోపీని ధరించి అక్కడి సంప్రదాయానికి గౌరవమిచ్చారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్‌తో పాటు పలువురు మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.