ముంబై: బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాజీనామా చేశారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఊర్మిళ మటోండ్కర్ ఆరు నెలలు కూడా
ఉండకుండానే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అధిష్టానంపై పంపినట్టు తెలుస్తోంది. తన రాజీనామాపై ఊర్మిళ మీడియాతో మాట్లాడుతూ... సమున్నత లక్ష్యం కోసం ముంబై కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే పార్టీలోని అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఇష్టం లేదని అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
కాగా... గత లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్‌పై పోటీ చేసిన ఊర్మిళ, బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో 4 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయినా విషయం తెలిసిందే.