బెంగళూరు: చంద్రుని ఉపరితలంపై కూలిపోయిన ల్యాండర్ విక్రమ్ ముక్కలవలేదని ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ సమస్య
తలెత్తడంతో దాని నుంచి సిగ్నల్స్ మాత్రమే కట్ అయ్యాయని పేర్కొంది. ప్రజ్ఞాన్ రోవర్... ల్యాండర్ లోపలే ఉన్నట్టు స్పష్టం చేసింది. అయితే నిర్దేశిత ల్యాండింగ్ ప్రాంతానికి కొద్ది దూరంలో, విక్రమ్ ఓ పక్కకి ఒరిగి ఉన్నట్టు తెలిపింది. ఇంకా 12 రోజుల పాటు దాని సంకేతాల గురించి ప్రయత్నించనున్నట్లు ఇస్రో చెబుతోంది. విక్రమ్ సరిగా ఉంటేనే.. దాంట్లో ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ఓ శాస్త్రవేత్త వివరించారు.