ఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రామ్ జఠ్మలానీ (95)కి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రామ్ జఠ్మలానీ నివాసానికెళ్లిన ప్రధాని
ఆయన పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం రామ్ జఠ్మలానీ కుటుంబ సభ్యులను మోడీ పరామర్శించారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పలువురు నేతలు కూడా రామ్ జఠ్మలానీ పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు.