భానుడి భగభగలతో విలవిలలాడిపోతున్న తెలుగు ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. ఈ వేసవిలో నిప్పులు కక్కిన సూర్యుడు త్వరలోనే శాంతించనున్నాడని... నిప్పుల కొలిమిగా మారిన తెలుగు రాష్ట్రాలు కాస్త చల్లబడనున్నాయని చెబుతున్నారు.మరో వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ర్టాలలో వర్షాలు ప్రారంభం కానున్నాయని అంటున్నారు.
ఇప్పటి వరకు ఎండ వేడిమి తో రెండు రాష్ట్రాలు మండిపోయాయి. వడదెబ్బకు తాళలేక వందల సంఖ్యలో వ్యక్తులు మృత్యువాతపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో గత పది రోజులు ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరిగాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.బంగాళా ఖాతం,ఉత్తర భారతం నుండి వేడి గాలలు ప్రభావం ఎండల పై తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు.ఇవి మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఛత్తీస్ గడ్ పై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, భూ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో ఊష్ణోగ్రతలు తగ్గిన వడగాలుల ప్రభావం అలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.అయితే మరో 24గంటలు ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారి నరసింహరావు తెలిపారు.ఈ ఏడాది వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి.కనుక వేసవి కాలం ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=rG1G5pFBT2M