నల్లగొండ జిల్లా: విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన గురువే అడ్డదారి తొక్కాడు. అభం శుభం తెలియని విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ట్యూషన్ పేరుతో ఇంటికి పిలిపించుకుని 9వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కీచక టీచర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.