హైదరాబాద్ కూకట్ పల్లిలో ఆక్టోపస్ అడిషనల్ డిజి గోవింద్ సింగ్ కుమారుడు హల్ చల్ చేశాడు. తాగిన మైకంలో పోలీసు వాహనాన్ని నడిపిన సవ్యసాచి నిజాంపేట వద్ద మహిళను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది.
గాయపడిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.