ఆదిలాబాద్ : లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు రవీందర్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వైద్య ధ్రువీకరణ పత్రం కోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా రవీందర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంతో పాటు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.