ఒంగోలు పోలీసులు మరో సారి వార్తల్లోకి ఎక్కారు. తన కూతురిని అల్లుడు హత్య చేశాడని ఫిర్యాదు చేయ్యడానికి వచ్చిన భాదితులకు వన్ టౌన్ పోలీసులు చుక్కలు చూపించారు. మంత్రి నుంచి వస్తేగాని సిఐ సుభాషిణిలో కదలిక రాలేదు.
బాధితులు మధ్యాహ్నం నుంచి పోలీస్ స్టేషన్ వద్ద అందోళన చేస్తున్నారు. గత ఎడు సంవత్సారల క్రితం విజయవాడ సమీపంలోని గోల్లపూడి గ్రామానికి చెందిన వినీల తో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం యం నిడమానూరు గ్రామానికి చెందిన రాధాకష్టాతో వివాహం జరిగింది. వివాహ సమయంలో పెంళ్లి కోడుకుకు భాగానే కట్న కానులక ముట్ట చెప్పారు. 15 లక్షల డబ్బు , 12 సవర్ల బంగారం కూడా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా వినీల కుటుంభం ఒంగోలులోని లాయర్ పేటలో నివాసం ఉంటున్నారు చెడు వ్యసనాలకు భానిసైన రాధాకష్ణ గత కోంత కాలంగా అధిక కట్నం కోసం వినీలాను వేధించడం ప్రాంరభించాడు. ఈక్రమంలో వెనీలాకు రెండో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో అత్తారింటి వేదింపులు అధికం అయ్యాయి. ఈ క్రమంలోనే వినీలాను రాత్రి రాధాకష్ట హత్య చేశాడని వెనీల బందవులు అరోపిస్తున్నారు. వినీలను భర్త హత్య చేసి ఉదయం ఎవ్వరికీ చెప్పకుండా టంగుటూరు మండలంలోని యం నిడమానూరు తీసుకు వెళ్లాడని చెప్తున్నారు. ఇదే విషయంపై వినీల బంధువులు స్తానిక వన్ టౌన్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయ్యడానికి వెళ్తే ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అరోపిస్తూ అందోళనక దిగారు. మధ్యాహ్నం నుంచి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాసిఐ సుభాషిణీ పట్టించుకోకుండా వినీలా భౌతికకాయం ఇక్కడ లేదు కనుక టంగుటూరు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయ్యమందంటూ బంధువులు అందోళనకు దిగారు. ఈ విషయంపై మంత్రి దేవినేని ఉమాతో సిఐ సుభాషిణీకి ఫోన్ చేయించినా ఆమె పట్టించుకోవడం లేదని బందవులు అరోపిస్తున్నారు. రాధాకష్ణ పోలీసులను డబ్బుతో కొన్నాడని అరోపిస్తున్నారు. ఒంగోలులో చనిపోయిన వినీల డెడ్ బాడీని పోలీసుల అనుమతి లేకుండా వేరే ప్రాంతానికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు.