Print
Hits: 3710

మంచిర్యాల: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి... తాత్కాలిక మహిళ కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన

మంచిర్యాల జిల్లాలో ఈ రోజు చోటుచేసుకుంది. చెన్నూరు నుంచి మంచిర్యాల వస్తున్న ఆర్టీసీ బస్సులో తాత్కాలిక డ్రైవర్‌ గా శ్రీనివాస్‌ విధులు నిర్వహిస్తున్నారు. అదే బస్సులో కండక్టర్‌ గా ఓ మహిళా జాబ్ చేస్తుండడంతో.. శ్రీనివాస్‌ ఆ మహిళను బలవంతం చేయాలనుకున్నాడు. దీంతో పథకం ప్రకారం బస్సులో ప్రయాణికులెవరు ఎక్కకుండా చూసిన శ్రీనివాస్‌.. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో బస్సును ఆపి మహిళా కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించాడు. అయితే... శ్రీనివాస్‌ బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు జైపూర్‌ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

e-max.it: your social media marketing partner