వరదయ్యపాళెం: కల్కి భగవాన్ దంపతులకు చెందిన ఆశ్రమంలో మూడోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు
నిర్వాహిస్తున్నారు. ఇప్పటికే ఆశ్రమంలో భారీగా అక్రమాస్తులు, కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు... కల్కి భగవాన్ కొడుకు కృష్ణ నాయుడు, కోడలు ప్రీతి నాయుడులను, అలాగే... ట్రస్ట్ నిర్వాహకుడు లోకేష్ దాసాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆశ్రమంను పూర్తిగా స్వాధీనం చేసుకున్న అధికారులు... సిబ్బందిని కూడా లోపలి అనుమతించడంలేదు. ఆశ్రమ నిర్వాహకులు, దాసాజీలను వేరు వేరుగా విచారిస్తున్నారు. విచారణలో ఆశ్రమంలోని క్యాంపస్ -3లో భారీగా విదేశీ నగదు, బంగారం దాచినట్లు గ్రహించిన అధికారులు అక్కడ సోదాలు చేసి గుట్టలుగా పోసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ దానం స్వదేశీ, విదేశీ భక్తుల ద్వారా విరాళాలుగా సేకరించి, ఆ డబ్బుతో వందల ఎకరాలు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే... ఇప్పటికీ కల్కి భగవాన్ దంపతులు అజ్ఞాతంలోనే ఉన్నారు.