బాలాసోర్: ఒడిశాలో భారీ మొత్తంలో బ్రౌన్ షుగర్ పట్టు బడింది. బాలాసోర్ జిల్లా జలేశ్వర్‌లోని సెక్బాడీ ఏరియాలో ఉన్న ఓ ఇంటిపై ఎక్సైజ్ శాఖ అధికారులు
దాడులు చేపట్టారు. సోదాల్లో ఓ ఇంట్లో దాచిపెట్టిన సుమారు 305 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను గుర్తించి సీజ్ చేశారు. కాగా... మార్కెట్‌లో దీని విలువ రూ.35 లక్షలుంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సపన్ ప్రదాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. సపన్ ప్రదాన్ నార్కోటిక్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అధికారి పేర్కొన్నారు.