ముంబై: శివసేన పార్టీ ఎంపీ పై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టించింది. మరి కొద్దీ రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేన పార్టీ
జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆ పార్టీ ఎంపీ ఓమ్‌రాజే నీమ్‌బల్కార్ ఉస్మానబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పడోలి నైగావ్ గ్రామంలో ఓమ్‌రాజే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయన వద్దకు వచ్చిన ఓ వ్యక్తి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి.. ఆ తర్వాత ఎంపీపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, శివసేన కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో ఎంపీ ఓమ్‌రాజే చేతికి స్వల్ప గాయమైంది. శివసేన పార్టీ ప్రత్యర్థులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా... ఓమ్‌రాజే ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.