ఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. చిదంబరం అరెస్ట్‌కు అనుమతించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై
విచారించిన ప్రత్యేక కోర్టు చిదంబరంను ఈడీ ప్రశ్నించవచ్చని, అవసరమైన పక్షంలో అరెస్ట్ కూడా చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం ఈడీ అధికారులు చిదంబరంతో పాటు కార్తీ చిదంబరం, నళిని చిదంబరంను విచారించారు. అనంతరం చిదంబరంను అరెస్ట్ చేశారు.